పర్సనల్ స్టోరీ చెప్పబోతున్న సమంత.

  0
  488

  ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి సమంత గెస్ట్ గా వస్తున్నట్టు తెలుస్తోంది. విడాకుల వ్యవహారం బయటకొచ్చాక తొలిసారిగా సమంత ఈ షో కి వస్తున్నారు. దీంతో ఈ షో లో మరింత సమాచారం ఆమె బయటపెట్టే అవకాశాలున్నాయని అంచనా. మరి ఎన్టీఆర్ ముందు సమంత మనసు విప్పి మాట్లాడుతుందా.. హాట్ సీట్ లో కూర్చుని ఏమని చెబుతుందో చూడాలి.

  ఇంతకు ముందే సమంతని ఈ షో కోసం అడిగారని తాజాగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. నాగ చైతన్యతో విడాకుల వ్యవహారం వల్ల మీడియాతో పాటు జనాల నోళ్ళలో నానిన సామ్ ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనేమి తప్పు చేయలేదు. పరస్పర ఒప్పందంతోనే ఇద్దరూ విడిపోయారు. చైతు ఆల్రెడీ నార్మల్ అయిపోయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తన రెగ్యులర్ వర్క్ స్టార్ట్ చేసేసాడు. సో సమంతా ఒక్కతే అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం లేదు.దానికి ఎవరు మీలో కోటీశ్వరులు లాంటివి మంచి వేదికలు

  ఎలాగూ తారక్ అనుమతి లేకుండా సామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంగతులు అడగడు. సో సమంతా ఏదైనా చెప్పాలనుకుంటే నో చెప్పరు. ఈ ఇద్దరి కాంబోలో బృందావనం, జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాలు వచ్చాయి. మొదటి రెండు భారీ హిట్లు కూడా. సో కెమిస్ట్రీ పరంగా ఇద్దరి జోడి ఈ క్విజ్ షోకు ఆకర్షణగా మారుతుంది. అధికారికంగా ఇది చెప్పలేదు కానీ అంతర్గతంగా వచ్చిన సమాచారం మేరకు ఫిలిం నగర్ టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ 5 గట్టి పోటీ అవుతుందేమో అనుకుంటే అంచనాలకు భిన్నంగా ఎవరు మీలో కోటీశ్వరులే దూసుకుపోతుండటం గమనార్హం

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..