భార్య భర్తల విడాకులకు ట్రాఫిక్ కూడా కారణమవుతుందా..?

    0
    78

    భార్య భర్తల విడాకులకు ట్రాఫిక్ కూడా కారణమవుతుందా..? ఏ ప్రశ్న ఎవరినైనా అడిగితే.. అడిగిన వారిని అమాయకంగా చూస్తారు. కానీ మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత మాత్రం సమాజంలో మూడు శాతం విడాకులకు ట్రాఫిక్ కారణమని చెబుతోంది. సామాన్య మహిళగానే తానీ విషయాన్ని చెబుతున్నానని.. మాజీ సీఎం భార్యగానో, బీజేపీ నాయకురాలిగానో చెప్పడం లేదని అంటోంది. రోడ్లలో గుంటలు, ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇంటికి చేరుకోలేకపోవడానికి కారణం.

    దీనివలన చాలామంది కుటుంబంతో గడపలేక పోతున్నారని అందువలనే విడాకుల శాతంలో మూడు శాతం ట్రాఫిక్ కారణాలతో విడిపోతున్నారని చెప్పింది. ముంబైలో తాను ఇటువంటి పరిస్థితిని గమనించానని కూడా చెప్పింది. ఆమె ప్రకటనను శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది హేళన చేశారు. రోడ్డులో గుంటల కారణంగా ఆమె కూడా అలాంటి ఆలోచనలో ఉందేమోనని వ్యాఖ్యానించారు. దయచేసి బెంగుళూరు వాసులందరూ ఆమె ప్రకటనను చూడవద్దని.. ఒకవేళ చూస్తే ఇబ్బంది పడవలసి వస్తుందని కూడా జోక్ చేశారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..