తల్లికి తిండి పెట్టకుండా , బిక్షమెత్తుకునేట్టు చేశాడు..

    0
    68

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ, కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్వయానా ఆయన సోదరి సుమన్ తూర్ ఈ ఆరోపణలు చేయడం విశేషం. తల్లిని కూడా సిద్ధూ సరిగా చూసుకోలేదని, ఆమె దిక్కులేని మరణానికి సిద్ధూయే కారణం అని సుమన్ ఆరోపణలు చేసింది.చిన్నప్పుడు తన తల్లి తామిద్దర్నీ బాగా చూసుకునేదని, ఇద్దర్నీ సైకిల్ పై స్కూల్ కి తీసుకెళ్లేదని చెప్పారు సుమన్. అయితే తమ తండ్రి చనిపోయాక 1986లోనే సిద్ధూ తల్లిని దూరం పెట్టాడని, చివరక ఆమె 1989లో ఢిల్లీ రైల్వే స్టేషన్లో అన్నం లేక దిక్కులేని చావు చనిపోయిందని ఆరోపించింది సుమన్.

     

    తల్లి తమను కష్టపడి పెంచిందని, అయినా చివరి రోజల్లో ఆమెకు సేవ చేయలేదని చెప్పింది. ఆ సమయంలో తాను అమెరికాలో ఉన్నానని, తల్లి గురించి తనకే విషయాలు తెలయజేసేవారు కాదని అన్నది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో సిద్ధూ తల్లి అనాథగా చనిపోయిందని, ఆమెను నిజంగానే అనాథ అనుకుని కార్పొరేషన్ సిబ్బంది తీసుకెళ్లి దహనం చేశారని చెప్పింది సుమన్ తూర్. అయితే సిద్ధూ మాత్రం చిన్నప్పుడే తమ తల్లిదండ్రులిద్దరూ విడిపోయారని చెప్పేవాడని, కానీ తమ తల్లే తామిద్దరినీ పెంచి పెద్ద చేసిందని ఆరోపించింది సుమన్. సరిగ్గా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఆరోపణలు రావడంతో సిద్ధూ రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..