ఓ మానవ మృగానికి తగిన శిక్ష పడింది.

    0
    59

    ఓ మానవ మృగానికి తగిన శిక్ష పడింది. ఆరేళ్ల పసిబిడ్డపై అత్యాచారం కేసులో మహ్మద్ మేజర్ అనే 48ఏళ్ల కసాయికి బీహార్ లోని అరారియా కోర్ట్ మరణ శిక్ష విధించింది. అన్నెం పున్నెం ఎరుగని దళిత బాలికకు మాయమాటలు చెప్పి, ప్రలోభ పెట్టి ఆ బాలికపై అత్యాచారం చేసిన మహ్మద్ కు జీవించే అర్హత లేదని, కోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిన 56 రోజుల్లోపు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కేసు విచారణ జరిపి శిక్ష ఖరారు చేసింది.

    గతేడాది డిసెంబర్ 2వ తేదీ తన కుమార్తె ఆడుకుంటుండగా కనిపించకండా పోయిందని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు రాత్రి 10గంటలకు ఇంటికొచ్చిందని చెప్పి జరిగిన సంఘటనను వివరించి పెద్దగా ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిందని తెలిపాడు. మహ్మద్ మేజర్ తన కుమార్తెను మంచినీళ్లు ఇస్తానంటూ లోపలికి పిలిచి ఆ తర్వాత పొలంలోకి తీసుకెళ్లాడని, అక్కడ బాలికపై అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ మేరకు పోలీసులక ఫిర్యాదు చేయడంతో ఆ తర్వాత మహ్మద్ నేపాల్ కి పారిపోయాడు. పది రోజల్లోనే నేపాల్ పోలీసుల సహకారంతో మహ్మద్ ని అరెస్ట్ చేసి, అరారియాకు తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసుని విచారించారు.

    లోకం తెలియని పసి వయసులో ఆరేళ్ల బాలికపై మానవ మృగం లాంటి మహ్మద్ చేసిన దారుణాన్నిసహిస్తే సమాజం క్షమించదని న్యాయమూర్తి చెప్పారు. మహ్మద్ తరపు న్యాయవాది మరణ శిక్ష కాకుండా దాన్ని యావజ్జీవ శిక్షకు మార్చాలంటూ చేసిన విజ్ఞప్తిని స్పెషల్ జడ్జి శశికాంత్ రాయ్ నిరాకరించారు. బాలికను కిడ్నాప్ చేయడమే కాకుండా, అత్యంత దారుణంగా హింసించి తన మృగత్వాన్ని చాటుకున్న మహ్మద్ ని క్షమిస్తే న్యాయానికి అర్థం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ మరణ శిక్ష సమాజంలో ఇలాంటి మానవ మృగాలకు ఒక గుణపాఠం కావాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..