‘మా’ కి పోటీగా ‘ఆత్మ’ మెగా ఆలోచన ?

  0
  2778

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత అంతా సద్దుమణిగిపోతుందని అనుకున్నారు. కానీ విష్ణు గెలుపుని ఇంకా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వరుసగా ‘మా’ కు రాజీనామాలు చేస్తున్నారు. నాగబాబు ‘మా’ కు గుడ్ బై చెప్పేశారు, ప్రకాష్ రాజ్ కూడా సభ్యత్వం వద్దన్నారు. హీరో శ్రీకాంత్ కూడా తన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవితోపాటు ‘మా’ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారని అనుకుంటున్నారు. ఈ దశలో అసలు ‘మా’ కి పోటీగా మరో సంఘం ఏర్పాటవుతుందని తెలుస్తోంది. దాని పేరు ‘ఆత్మ’ AT’MAA’ మరి దీన్ని ఎవరు లీడ్ చేస్తారు, ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది.

  ఎన్నికల ముందు ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే నినాదాన్ని బయటకు తీసుకొచ్చారు విష్ణు ప్యానల్ సభ్యులు. కానీ ప్రకాష్ రాజు కు మద్దతుగా ఉన్న మెగా బ్రదర్ నాగ బాబు మాత్రం.. నటుడికి లోకల్ నాన్ లోకల్ అనే మాట ఉండదు అని చెప్పుకొచ్చారు. కానీ మా ఎన్నికల్లో మాత్రం ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. దీనితో ప్రాంతీయభావం ఉన్న చోట నేను ఉండలేను అంటూ చెప్తూనే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అంటూ ప్రకటించారు నాగ బాబు. ఆ వెంటనే ప్రకాష్ రాజ్ కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇక తాజాగా శివాజీ రాజా కూడా రాజీనామా చేస్తాననటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే మా కు పోటీగా మరో అసోసియేషన్ రానుందా అంటే అనుననే అంటున్నారు సినీ పండితులు. ఈ మేర సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్తగా ఓ పేరు కూడా బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ATMAA ). ఒకవేళ అదే కనుక జరిగితే మా రెండుగా చీలిపోనుంది. ఇక ఆత్మ ను కుల, మత, ప్రాంతీయులు, భాష అతీతంగా తెలుగు సినిమా లో ఎవరు అయితే నటిస్తూ యూనియన్ లో చేరుతారో వారిందరు కలిసి త్వరలో ఈ అసోసియేషన్ ను పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..