కోడలిని కాపాడమని అత్త చీర విప్పి అందించినా, పాపం.

  0
  10124

  పెళ్ళిముచ్చట తీరకుండానే , కాళ్లపారాణి ఆరకుండానే సంధ్య వాలిపోయింది. నిద్రలోనే, నీళ్లలోనే కన్నుమూసింది. రెండురోజుల క్రితం తిరుపతిలో అండర్ బ్రిడ్జి నీళ్లలో వాహనం మునిగి చనిపోయిన సంధ్య విషాదాంతం హృదయాలను కలచిచేసేది. కొత్తగా పెళ్ళైన సంధ్య కుటుంబసభ్యులు తోడికోడళ్లతో తిరుమల యాత్రకు బయలుదేరింది. వాహనం వెనుక సీట్లో  సంధ్య నిద్రపోతుంది. రాత్రి ఒంటిగంట సమయంలో భారీ వర్షానికి అండర్ బ్రిడ్జ్ కింద 8 అడుగులమేర నీరు ఉండిపోయింది. ఆ ప్రాంతానికి డ్రైవర్ కొత్తకావడంతో , వాహనం దింపేసాడు. కొందరు వాహనం దిగేసి తప్పించుకున్నారు. వ్యాన్ లో ఉన్న వారికోసం , సంధ్య అత్త తన చీర విప్పి , వారిని రక్షించేందుకు వాడమని చెప్పింది.. అలా నలుగురిని కాపాడారు. వెనుకసీట్లో ఉన్న సంధ్యమాత్రం అప్పటికే నిద్రలో నీళ్లలోనే మరణించింది.. వీళ్ళందరూ కర్ణాటక రాయచూరు సమీపంలోని ముదగల్‌ గ్రామానికి చెందిన వారు. పెద్ద అల్లుడు సువర్ణ భర్త వినోద్‌కుమార్, రెండో అల్లుడు సంధ్య భర్త హరీష్‌తో పాటు రెండేళ్ల మనుమరాలు విన్మయ్‌ తదితర కుటుంబ సభ్యులు మొత్తం ఎనిమిది మందితో గురువారం రాత్రి బెంగళూరు మీదుగా శుక్రవారం కంచికి చేరుకున్నారు. అక్కడనుంచి తిరుమల వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..