విమానం టికెట్లు పంపి ఇలా చేశాడు మెగా హీరో.

  0
  609

  విశాఖకు చెందిన తన అభిమాని ఆరోగ్యపరిస్థితి బాగాలేదని తెలుసుకున్న మెగా హీరో చిరంజీవి , స్పందించిన తీరు , అభిమానులనుల్లో ఆనందం నింపింది. మెగా మనసు ఎంతమంచిదో అని అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తనవద్దకు రాలేని వెంకట్‌ అనే అభిమానికి , అయన భార్యకు విమానం టికెట్లు పంపి , పిలిపించుకొని , ఆయన వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని హామీఇచ్చారు . శనివారం వెంకట్‌, ఆయన భార సుజాతని తన నివాసంలో చిరంజీవి కలిశారు. వారితో చిరు దాదాపు 45 నిమిషాల సమయం కూడా ముచ్చటించారు.

  వెంకట్‌ అరోగ్య సమస్యపై పూర్తి వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు. ఒమేగా హాస్పిటల్స్ లో తెలిసిన డాక్టర్లతో మాట్లాడిన చిరంజీవి పరిస్థితి అడిగి తెల్సుకున్నారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకుంటామని భరోసా ఇచ్చాడు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..