క్లోజ్ ఫ్రెండ్ తో సమంత చార్ ధామ్ యాత్ర..

  0
  7910

  ప్రస్తుతం సమంత చార్ దామ్ యాత్రలో ఉన్నారు. ఆమెతోపాటు ఆమె క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డి కూడా ఉన్నారు. ఈ యాత్రకు సంబంధించిన ఫొటోలను శిల్పారెడ్డి ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు. ఓవైపు విడాకుల విష‌యంలో త‌న‌పై తప్పుడు ప్రచారం చేశారంటూ యూట్యూబ్ చాన‌ళ్ల‌కు లీగ‌ల్ నోటీసులు పంపించి, వారిని కోర్టుకు ఈడ్చిన సమంత, ఇలా ప్రశాంతంగా తీర్థయాత్రలకు బయలుదేరారని అర్థమవుతోంది.

  https://www.instagram.com/p/CVRlbihDUEq/?utm_source=ig_web_copy_link

  ఇప్ప‌టికే సమంత, శిల్పారెడ్డి రిషికేష్ యాత్ర‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం య‌మునోత్రి సంద‌ర్శ‌న‌లో ఉన్నారు. హెలికాప్ట‌ర్లో తాము బ‌య‌ల్దేరుతున్న పిక్ ను శిల్పా రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇంత‌కు ముందే ఈమె ఇత‌ర దైవ క్షేత్రాల‌ను కూడా సంద‌ర్శిస్తూ వ‌స్తోంది. ఇటీవ‌లే తిరుమ‌ల శ్రీవారిని కూడా ద‌ర్శించుకుంది. విడాకుల వ్య‌వ‌హారంతో స‌మంత ఎంతో కొంత డిస్ట్ర‌బ్ అయి ఉండ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆధ్యాత్మిక క్షేత్రాల సంద‌ర్శ‌న ద్వారా ప్ర‌శాంతత‌ను పొందే ప్ర‌య‌త్నం చేస్తూ ఉండ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం అవుతోంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..