వైరల్ అవుతున్న సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ పిక్..

  0
  580

  సాయి ధరమ్ తేజ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంతవరకు అతని ఫొటో ఏదీ బయటకు రానీయలేదు. మెగా ఫ్యామిలీ ఆయన హెల్త్ విషయంలో మీడియా చేసిన అతిపై ఆగ్రహంతో ఉందట. అందుకే ఎవర్నీ దగ్గరకు రానీయడంలేదు, ఏ విషయమూ చెప్పడంలేదు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ సాయి ధరమ్ తేజ్ ని కలిశాడు. ఈ సందర్భంగా ఆయన చేతిలో తన చేయి వేసిన ఫొటో ఒకటి రిలీజ్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  తాను సాయి ధరమ్ తేజ్‌ని కలిశానని, అద్భుతంగా మాట్లాడాడని ట్వీట్ చేశారు. “నా బ్రదర్ తేజ్ సూపర్ ఫిట్‌గా ఉన్నాడు. జయించేందుకు సిద్ధమవుతున్నాడు. ఫుల్లీ అండ్ మళ్ళీ లోడెడ్” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో “తేజ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఆయన యాక్సిడెంట్ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తూ చాలా మంది భోజనం చేస్తున్నారు” అంటూ యూట్యూబ్ ఛానెళ్లపై, వెబ్ సైట్స్ పై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

  సాయి ధరమ్ తేజ్ కొన్ని వారాల క్రితం దుర్గం చెరువు కేబుల్ వంతెన దగ్గర బైక్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తేజ్ కు అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ వంటి పలు ఆపరేషన్లు జరిగాయి. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న తేజ్ త్వరలోనే సినిమా షూటింగులతో కూడా పాల్గొంటాడని ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తేజ్ ను పరామర్శించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా తేజ్ హెల్త్ పై అప్డేట్ ఇచ్చారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..