మైనర్ మేనల్లుడుతో అత్త , లేచిపోదామని అడిగి..

  0
  34652

  వావి వరసలు , వయసు తేడాలులేని అక్రమసంబందాలు ఎంత దారుణానికి దారితీస్తుందో తెలిపే సంఘటమా బెంగుళూరులో జరిగింది. బాణసంహరి 3 స్టేజ్ కాలనీలో 28 ఏళ్ళ యువతి అఫ్రినా ఖానం (28) కి పెళ్ళై ఇద్దరు బిడ్డలు,. భర్త భర్త లాలూఖాన్‌ ఉద్యోగం చేస్తున్నాడు. భర్త చెల్లెలు కొడుకు మామ ఇంటికి వచ్చిపోతుంటాడు. వాడికి 17 ఏళ్ళు. ఆమె , ఈ కుర్రాడితో అక్రమసంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలిసింది. రెండు రోజులక్రితం , భర్త పిల్లలు ఇద్దరినీ తన తల్లి దగ్గర వదిలి వచ్చాడు. తన మేనల్లుడుతో , భార్య అక్రమసంబంధం గురించి నిలదీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో పిల్ల్లలు ఇంట్లో ఉండటం మంచిది కాదనుకున్నాడు. ఈ విషయమై భార్యను నిలదీసిన తరువాత , గొడవ జరిగింది. తరువాత అతను డ్యూటీకి వెళ్ళిపోయాడు.

  ఆమె , తనతో అక్రమసంబంధం ఉన్న బాలుడుని ఇంటికి పిలిపించింది. తమ విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి , లేచిపోయి , పెళ్లిచేసుకుందాం రమ్మని అడిగింది. అయితే తాను రానని ఆ బాలుడుచెప్పడంతో , పక్కనే ఉన్న కత్తెర తీసుకొని పొడిచింది. దీంతో బాలుడు ఆ కత్తెర తీసుకొని , ఆమెను పొడిచి చంపేశాడు. తర్వాత , ఇంట్లో మంచం మీద దుప్పట్లు తగలబెట్టి వెళ్ళిపోయాడు. ఇలాగైతే ఇల్లుకాలిపోయి , ఆమె మంటల్లో మరణించిందని బావిస్తారన్నది , వాడి ఆలోచన.. అయితే దుప్పట్లమాత్రమే కాలి , కిటికీలోనుంచి పొగరావడంతో పక్కింటి వారు , చేసిన ఫిర్యాదుతో ఈ ఘోరం బయటపడింది. బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..