సౌత్ ఇండియన్ బ్యూటీ సమంత ఏం చేసినా సెన్సేషనే. సినిమాలే కాదు ఫన్ చేయాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా… ఈ కేరళ కుట్టి తర్వాతే ఎవరైనా. వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తనకు ఇష్టమైనవన్నీ వరుసగా చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవల ‘లెవెల్ అప్’ అనే ఛాలెంజ్ స్వీకరించి, తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయింది. తాజాగా జిమ్‌లో సమంత సీరియస్ గా వర్కవుట్స్ చేస్తూ కనిపిస్తోంది. సామ్ ను చూస్తుంటే, ఏదో వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్తున్నంత సీరియస్ గా వర్కవుట్స్ చేస్తోంది. అలా… 75, 78, 80 కేజీల బరువును ఈజీగా ఎత్తి పడేసింది సామ్. నిజానికి సామ్ వెయిట్ చాలా తక్కువ. స్లిమ్ గా, నాజూకుగా ఉండే సమంత… ఇంత బరువు ఎలా ఎత్తగలిగిందా అంటూ చూసే వారంతా నోరెళ్ళబెట్టేశారు. తన ఫోటోలు, వీడియోను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.