కూతురు ప్రేమించి పెళ్లాడిందని..

  0
  90

  బతికుండగానే కూతురికి పిండం పెట్టిన తండ్రి..

  కూతురు ప్రేమ పెళ్లి చేసుకందన్న కారణంతో కూతురు బ్రతికుండగానే తండ్రి పిండం పెట్టి శ్రద్దాంజలి ఘటించన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేకుంది. చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అనేయువతి.. అదే గ్రామానికి చెందిన వెంకంటేశ్ అనే యువకుడిని ఈ నెల 13న ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లో పెద్దలకు తెలియకుండా వీరిద్దరూ వెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తిరిగి ఇంటికొచ్చారు. అయితే అమ్మాయి తండ్రికి ఇది ఇష్టం లేదు. కూతురు చనిపోయిందని గుండు గీయించుకుని కర్మకాండ నిర్వహించాడు. అంతే కాదు, కూతురు చనిపోయిందని ఓ ఫ్లెక్సీ కూడా వేయించాడు. కూతురు చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కూతురు కళ్లముందుండగానే తండ్రి ఇలా చేయడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే.. వీలైతే ఒప్పుకోవాలని, లేదంటే దూరం పెట్టాలని, అంతేకాని, ఇలా కూతురికి పిండం పెట్టడం ఏంటని అడుగుతున్నారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..