క్యూలో నిలబడితే గంటకు 2 వేలు.. అదే ఉద్యోగం..

  0
  78

  ర‌క‌ర‌కాల ఉద్యోగాల్లో అత‌డిది ఒక ర‌కం ఉద్యోగి. ఆ ఉద్యోగికి య‌జ‌మాని ఎవ‌రూ ఉండ‌రు. తానే య‌జ‌మాని. ఆ ఉద్యోగానికి క్యూలో నిల‌బ‌డ‌డం త‌ప్ప ప‌ని ఏమీ ఉండ‌దు. కోటీశ్వ‌రుల కోసం వారి స్థానం కోసం క్యూలో నిల‌బ‌డి గంట‌ల కొద్దీ వేచి ఉండ‌డం అత‌ని ప‌ని, ఇందుకోసం ఫ్రెడ్డీ బెకిట్ అనే వ్య‌క్తి గంట‌కు రెండు వేల రూపాయ‌లు వ‌సూలు చేస్తాడు. విమానం టిక్కెట్లు, ఇత‌ర‌త్రా కూప‌న్లు, ఇంకేదైనా స‌ర్టిఫికెట్లు వంటి ప‌నులేవైనా ఉంటే త‌న‌కు మొబైల్ లో మెసేజ్‌లు పెడ‌తార‌ని, తాను వెళ్ళి క్యూలో నిల‌బ‌డి ఆ ప‌ని పూర్తి చేస్తాన‌ని చెబుతున్నాడు.

  ఈ ఉద్యోగానికి చాలా స‌హ‌నం అవ‌స‌ర‌మ‌ని, ఒక్కోద‌ఫా 8 గంట‌ల పాటు క్యూలో నిల‌బ‌డాల్సి వ‌స్తుంద‌ని చెప్తున్నాడు. ఎండ‌, వానా తేడా లేకుండా ఎన్ని గంట‌లైనా క్యూలో ఉంటాన‌ని తెలిపాడు. ప్రొఫెష‌న‌ల్ క్యూ ప‌ర్స‌న్స్ కు ఉపాధి ఇటీవ‌ల బ్రిట‌న్ లో విప‌రీతంగా పెరిగింద‌ని, డ‌బ్బున్న వాళ్ళ‌కు స‌హ‌నం త‌క్కువ కావ‌డంతో దీనికి తోడు క్యూలో నిల‌బ‌డే స‌మ‌యానికి వారు వ్యాపారాలు చేసుకుని మ‌రింత ఎక్కువ సంపాదిస్తార‌ని, అందువ‌ల్లే ప్రొఫెష‌న‌ల్ క్యూ ప‌ర్స‌న్స్ కి డిమాండ్ పెరిగింద‌ని అంటున్నాడు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..