ఇదేమిటి.. ఏమి జరుగుతొంది.. అంటూ సల్మాన్ ఖాన్ , సమంతల ట్వీట్లు , పాటలపై సినిమావర్గాల్లో చర్చ జరుగుతొంది. సల్మాన్ ఖాన్ ని , మీకేపాట ఇష్టమని అడిగిన దానికి , ఊ అంటావా , మావా ..అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు.. ఆ వెంటనే ఇది సోషల్ మీడియా సెన్సేషన్ కావడంతో , సమంత కూడా , హార్ట్ సింబల్ తో థాంక్స్ చెప్పింది. సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. యశోద, శాకుంతలం, ఖుషితోపాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో సామ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
దక్షిణాది సినిమారంగంలో లో టాప్ రేంజ్ లో ఉన్న సమంత ఇప్పుడు భారత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్. ఈ మేరకు ఇటీవల ‘ఓర్మాక్స్ సర్వేలో వెల్లడైంది. సినిమా రంగంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు అంటూ ఓ సర్వే నిర్వహించింది. అందులో సమంత అగ్ర స్థానం , ఆలియా భట్ రెండో స్థానంలో నయనతారది మూడో స్థానం. దీపికా పదుకొనె ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. తర్వాత కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, రష్మిక, పూజా హెగ్డే, అనుష్కా శెట్టిలకు చోటు దక్కింది.
సమంత ఇప్పటిదాకా ఒక్క హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించలేదు. అయినా బాలీవుడ్ లోనూ ఆమెకు ఇంత క్రేజ్ రావడం విశేషం. దక్షిణాది అన్ని భాషల్లో సత్తా చాటుకున్న సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో భాగంలో కీలక పాత్రతో హిందీ జనాలకు చేరువైంది. ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ‘పుష్ప’సినిమాలో ఊ అంటావా స్పెషల్ సాంగ్ తర్వాత బాలీవుడ్‌లోనూ సమంత పేరు మార్మోగుతోంది.
The last clip of Salman saying a song from a movie #Pushpa #alluarjun #SalmanKhan 😂😂😂😂 pic.twitter.com/2sxU8GZq5Z
— salmankhan_team (@ManelKh18) June 26, 2022