పెళ్లి కోసం అమ్మాయి కావాలంటూ ఊరంతాపోస్టర్లు

  0
  111

  పెళ్లి కోసం పాట్లు.. భార్య కావాలంటూ ఊరంతాపోస్టర్లు. చిన్నపిల్లలు తప్పిపోయారనో… లేదా మతిస్థిమితం లేనివారు కనిపించకుండా పోయారనో మనం తరచుగా గోడలపై పోస్టర్లలో చూస్తుంటాం.. కానీ మదురైలోని విల్లుపురంలో ‘నాకు మంచి భార్య కావాలి’ అనే పోస్టర్లు దర్శన మిస్తున్నాయి. ఎవరు వీటిని అతికించారు. అసలేంటీ కథ

  తమిళనాడులో ఓ వ్యక్తి వధువు కావాలంటూ పోస్టర్లు అంటించాడు. మదురైలోని విల్లుపురంలో నివసించే 27ఏళ్ల జగన్.. పట్టణమంతా ఈ పోస్టర్లు అతికించాడు. మంచి భాగస్వామి కోసం తాను వెతుకుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

  తాను ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు జగన్ పేర్కొన్నాడు. సంప్రదాయ పద్ధతుల్లో భాగస్వామిని వెతికేందుకు ప్రయత్నించిన అతడు.. అవి పనిచేయక పోయే సరికి ఈ మార్గం ఎంచుకున్నాడు.గోడకు అంటించిన పోస్టర్లలో తన పేరు, కులం, వేతనం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ స్పష్టంగా ఉండేలా చూసుకున్నాడు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.