ఏమీచేయలేక కలెక్టర్ కూడా కన్నీరు పెట్టాడు..

  0
  2941

  మనిషన్న తరువాత మనసుంటుంది.. కొంతమంది బాధలు వింటే మనసున్నవాడి కంట కన్నీరొలుకుతుంది.. పాపం ఈ అందమైన బిక్షగాడి విషయం తెలిస్తే కన్నీరు ఆగదు.. ఇతని పేరు చిన్నకన్ను .. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా చినగౌండర్ గ్రామం.. ఐదేళ్ల వయసులోనే అంధుడయ్యాడు. అప్పటినుంచి బిక్షాటనే వృత్తిగా బతుకుతున్న్నాడు. ఇలాంటి వాడిని కూడా దురదృష్టం వెంటాడింది అంటే , విధి ఎంత క్రూరమైందో అర్ధం చేసుకోండి..

  దేశంలో 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దుకు ముందు ఈ వృద్దుడికి అనారోగ్యం సోకింది. అప్పటికే బిక్షాటన ద్వారా 12 ఏళ్లుగా మిగిల్చుకున్న డబ్బును పెద్ద నోట్లుగా మార్చి పెట్టుకున్నాడు. తానుండే గుడిసెలోనే దాచిపెట్టాడు. అనార్యోగంతో ఆసుపత్రిలో చేరాడు. అప్పుడే మతిమరుపు కూడా వచ్చేసింది. రోగం బాగైనా జ్ఞాపక శక్తి రాలేదు.. అలాగే ఇల్లొదిలి బిక్షాటన చేసుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తన గుడిసె , దానిలో దాచిపెట్టిన డబ్బు ..అన్నీ గుర్తుకొచ్చి ఇంటికొచ్చి చూసుకున్నాడు. అయితే అవి ఇప్పుడు చెల్లవని చెప్పడంతో పెద్దగా ఏడుస్తూ , క్రిష్ణగిరి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి , అందరినీ కాళ్లావేళ్లా పడుతున్నాడు.. అతడి బాధ చూసినవారి కడుపు తరుక్కుపోతుంది.. అయినా ఏమిచేయలేని పరిస్థితి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..