నాటు నాటు.. ఆర్ఆర్ఆర్ లో అదిరిపోయే పాట..

  0
  320

  రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి నా పాట సూడు అనే సాంగ్ ప్రోమో విడుదలైంది. పాట పూర్తి వెర్షన్ నవంబర్ 10న విడుదలవుతుంది. ఫుల్‌ మాస్‌ డ్యాన్స్‌తో సాగే ఈ పాట లిరికల్‌ ప్రోమోని కాసేపటి క్రితం చిత్రబృందం విడుదల చేసింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌-తారక్‌ పవర్‌ ఫుల్‌ స్టెప్పులతో అదరగొట్టేసినట్లు అర్థమవుతోంది. కీరవాణి స్వరాలు అందించగా.. రాహుల్‌ సిప్లింగంజ్‌, కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు.

  భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..