సినతల్లికి ఇల్లు.. లారెన్స్ పెద్ద మనసు..

  0
  214

  న‌టుడు, ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్ లారెన్స్ ఆప‌ద‌లో ఉన్న‌వారికి త‌న‌వంతు సాయాలు చేసి ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు. తాజాగా ఆయ‌న జై భీమ్ అనే మూవీ చూసి కొన్ని స‌న్నివేశాల‌కు చలించి పోయారు. రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకుని రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు. ఒక తప్పుడు కేసు కారణంగా రాజకన్ను భార్య పార్వతి పడిన బాధ‌ని చూసి చ‌లించిపోయిన లారెన్స్ వారికి సొంత ఇల్లును నిర్మించి ఇస్తానని మాటిచ్చారు.

  ఈవిడే అసలు సినతల్లి.. పేరు పార్వతి..

  28 ఏళ్ల క్రితం జరిగిన ఘోరమైన సంఘటనలను జై భీమ్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల క‌ళ్ల ముందుంచారు హీరో సూర్య. ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది. అయితే చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని లారెన్స్ చెప్పారు. ఆయన భార్య పార్వతమ్మ (సినతల్లి)కి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. ఆమెకు తప్పకుండా మంచి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. అలానే జై భీమ్ చిత్రంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన చిత్ర యూనిట్‌కు, ఆ చిత్రాన్ని సంచలనంగా మార్చిన నటుడు సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్‌కు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు లారెన్స్.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..