బ్రెజిల్ లోని పుర్నాస్ సరస్సులో భీభత్సమైన ఘటన జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న బోట్లపై కొండరాయి విరిగిపడింది. కొండరాయి నీటిలో పడడంతో నీరు ఒక్కసారిగి పైకి ఎగతన్నింది. ఈ ఘటనలో ఏడుగురు టూరిస్టులు దుర్మరణం చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే బ్రెజిల్ నేవీ బృందాలు హుటాహుటీన సరస్సు వద్ద సహాయక చర్యలు చేపట్టాయి.