రైలుపట్టాలపై పడ్డ విమానం.. తర్వాత .. ?

  0
  133

  రైలు ప‌ట్టాల‌కు అడ్డంగా కొన్ని సంద‌ర్భాల్లో బ‌స్సులో కారులో బైక్‌లో అడ్డం రావ‌డం, రైళ్ళు వాటిని ఢీ కొన‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే ఏకంగా ఓ విమాన‌మే రైలు ప‌ట్టాల‌పై కూలిపోయింది. అదృష్టం ఏమిటంటే, ప‌ట్టాల‌పై కూలిన విమానం నుంచి పైలెట్ ను బ‌య‌ట‌కి తీసిన రెండు క్ష‌ణాల్లో ఆ ప‌ట్టాలపై నుంచి వేగంగా రైలు వెళ్ళ‌డం ఆ పైలెట్ ని చావు నుంచి త‌ప్పించింది. రైలు ప‌ట్టాల‌పై విమానం కూలిపోయి ఆ పైలెట్ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డం ఓ అదృష్టం అయితే క్ష‌ణాల్లో రైలు రావ‌డం, అత‌నిని పోలీసులు కాపాడ‌డం మ‌రో అదృష్టం.

  ఒక‌ర‌కంగా కొన్ని క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే ఆ పైలెట్ రెండు ద‌ఫాలు మృత్యువుని ఛాలెంజ్ చేసి బ‌య‌ట‌ప‌డ్డాడు. లాస్ ఏంజెల్స్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సెన్సా 72 విమానాన్ని త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కి తీసిన పైలెట్ గాల్లోకి ఎగిరాడు. సాంకేతిక కార‌ణాల‌తో ప‌ది నిమిషాల్లో ప‌ట్టాల‌పై అది కూలిపోయింది. ఆ స‌మ‌యంలో రైల్వే ట్రాక్ ప‌క్క‌నే ఉన్న పోలీసులు క‌నుచూపు మేర‌లో రైలు వ‌స్తుంద‌ని తెలిసి కూడా ధైర్యంగా పైలెట్ ను విమానం నుంచి బ‌య‌ట‌కి లాగారు. చుట్టుప‌క్క‌ల ఈ దృశ్యాన్ని చూసిన వారు పోలీసుల‌ను హెచ్చ‌రిస్తున్నా. పోలీసులు అత‌న్ని ర‌క్షించారు. క్ష‌ణాల్లోనే రైలు ప‌ట్టాల‌పై ఉన్న విమానాన్ని ముక్క‌లుముక్క‌లు చేస్తూ దూసుకెళ్ళింది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..