మనిషికి పంది కిడ్నీ.. సూపర్ సక్సెస్..

  0
  238

  మనిషికి పంది కిడ్నీ అమర్చడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. గత పదేళ్లుగా ఈ విషయంలో జరుగుతున్న పరిశోధనల్లో ఎంతో ప్రగతి కనపడింది. దీన్ని కార్యరూపంలోకి తెచ్చారు. గత 35ఏళ్లుగా మనుషులకు జంతువుల కిడ్నీలు అమర్చాలని పరిశోధనలు జరుగుతున్నాయి. అవయవ దానాలకు ఎక్కువమంది ముందుకు రాకపోవడంతో చాలామంది చనిపోతున్నారు. ప్రాణాపాయంలో ఉన్నవారికి జంతువుల కిడ్నీలు అమర్చే విషయంలో డాక్టర్లు ముందడుగు వేశారు. పంది కిడ్నీలు మనుషులకు సరిపోయే అవకాశం ఉంది. అయితే పంది కిడ్నీ కణాల్లో షుగర్ సెల్స్ కారణంగా దాన్ని మానవదేహం తిరస్కరించేది. దీంతో జన్యుపరంగా మార్పు చెందిన ఒక పంది నుంచి షుగర్ కారక కణాలను వేరు చేసి ఆ పందిని పుట్టించారు. ఇది మనిషికి అమర్చి చూసినప్పుడు మానవదేహం దాన్ని స్వీకరించినట్టు కనిపించింది.

  మొదటిగా మానవదేహం బయటే రెండు పెద్ద రక్తనాళాలను ఒక ప్రత్యేక పరికరంలో అమర్చిన ఈ పంది కిడ్నీని జతచేశారు. ఈ కిడ్నీ ఇతర కిడ్నీల లాగానే సాధారణంగానే పనిచేసింది. శరీరంలో వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి మూత్రాన్ని ఉత్పత్తి చేసింది. మానవదేహం తిరస్కరణకు కూడా ఇది గురి కాలేదు. జన్యుపరంగా మార్పు చెందిన పందినుంచి తీసుకున్న ఈ కిడ్నీ అత్యంత సమర్థంగా పనిచేసినట్టు గుర్తించామని డాక్టర్ రాబర్ట్ మౌంట్ గోెమెరే చెప్పారు.

  ఇది తమ ప్రయోగాల్లో చాలా ఆశాజనకమైన దశకు చేరుకుందని చెప్పారు. జంతువుల కిడ్నీలు మనుషులకు అమర్చే రోజు ఎంతో దూరంలో లేదని కూడా తెలిపారు. గతంలో బాబూన్ కోతులనుంచి మనుషులకు అమర్చిన గుండె 21రోజులు బాగా పనిచేసిందని తెలిపారు. పంది గుండె కవాటాలు కూడా గత పదేళ్లుగా మానవులలో విజయవంతంగా అమర్చుతున్నామని అన్నారు. రక్తాన్ని పలుచన చేసే మందు హెరాపిన్, పంది పేగులనుంచి తయారు చేసిందేనని గుర్తు చేశారు. పంది కనుపాపను కూడా మనుషులకు చైనాలో అమరుస్తున్నారని ఇలా తొందరలో జంతువుల అవయవాలు మనుషులకు అమర్చే ప్రయోగాలు తుది దశకు చేరుకుంటున్నాయని తెలిపారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..