వందేళ్ల వయసులో , తాతయ్య పెళ్లికొడుకాయెనే ..

    0
    107

    ఆకాశమంత పందిరి , భూదేవంత అరుగు.. పెళ్లి సంబరాలు గురించి .. ఇలా కథల్లో చదువుతుంటాం.. ఇప్పుడు ముషీరాబాద్ లో ఓ వృద్ధుడు తన భార్యను మళ్ళీ పెళ్లిచేసున్నాడు.. అతడి వయసు వందేళ్లు.. పేరు బిస్వాంత్ సర్కార్.. భార్యకు 90 ఏళ్ళు.. ఆమె పేరు సురోదవాని .. వాళ్ళిద్దరికీ 70 ఏళ్ళక్రితం పెళ్లయింది. అన్యోన్య దాంపత్యం.. కొడుకులు , కూతుళ్లు , కోడళ్ళు , అల్లుళ్ళు , మనవలు , మునిమనవలు .. ఇలా సాఫీగా సాగిపోతున్న సంసారం..

    ఇటీవల సోషల్ మీడియాలో వృద్ధ దంపతులకు మళ్ళీ పెళ్లిళ్లు వార్తలు ట్రెండింగ్ కావడంతో , కోడళ్ళకు , మనవళ్లకు వీళ్లకూ పెళ్ళిచేయాలని ఆలోచన వచ్చింది. వందేళ్ల జన్మదినాన్ని పెళ్లిగా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వృద్ధదంపతులకు పెళ్ళిఏర్పాట్లు చేశారు.

    వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించి అందరికీ పంచారు. పల్లకీలో పెళ్లి కూతురు , పెళ్లికొడుని తీసుకొచ్చి , ఇద్దరినీ మళ్లీ , గుర్రాలు లాగే రథంపై కూర్చోబెట్టి ఊరేగించారు. చివరగా ఊరంతా విందు పెట్టారు. 70 ఏళ్ళ దాంపత్యంలో ఈ మాత్రం సంబరం అవసరమేకదా అని కోడళ్ళు చెప్పారు.. తమ తాతయ్య , అవ్వ ల పెళ్లి ఇప్పుడు ఘనంగా చేశామని మనవళ్లు , మనవరాళ్లు సంబరపడ్డారు..

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..