సెహబాష్ ..కానిస్టేబుల్ , సమయానికి సాయం.

    0
    126

    రోడ్డుమీద ప్రమాదానికి గురై.. ఎవరైనా అపాయంలో ఉంటే మనకెందుకులే అని చాలామంది వెళ్లి పోతుంటారు. మరికొందరు సాయం చేయలేకపోయినా అయ్యో పాపం అనుకుంటూ వెళ్ళిపోతారు.. అయితే కొందరు మాత్రం ఆపదలో ఉన్నవారికి సాయం చేసి.. గొప్పమనసును చాటుకుంటారు. అలాంటి గొప్ప మనసున్న మనుషుల్లో బెంగుళూరుకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కాశప్ప కూడా ఒకరు. ఎందుకంటే కాశప్ప ఆపదలో ఉన్నవారిని కాపాడారు. తన డ్యూటీ కాకపోయినప్పటికీ సాయం చేసి.. శభాష్ అనిపించుకున్నారు.

    బెంగుళూరులో ఓ పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్ ప్యాలస్ రోడ్ లోకి వచ్చేసరికి సడెన్ గా టైర్ బరస్ట్ అయింది. అంబులెన్సులో ఊపిరి ఆడని బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.  ట్రాఫిక్ డ్యూటీలో బిజీగా ఉన్న కానిస్టేబుల్ కు , రోడ్లో ఆగిపోయిన అంబులెన్స్ లో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఇద్దరు ఆడబిడ్డల పరిస్థితి … ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కాశప్ప ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. మనకెందుకులే.. మన డ్యూటీ కాదు కదా అని ఊరుకోలేదు. స్పందించాడు. వెంటనే రంగంలోకి దిగిపోయాడు.

     

    అంబులెన్స్ డ్రైవర్ సాయంతో టైర్ మార్చి.. స్టెప్నీ వేసి అంబులెన్సును అక్కడినుంచి పంపించేశాడు. ఈ తతంగం మొత్తాన్ని పక్కనే రోడ్డుపై వెళ్తున్న చాలామంది షూట్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. కాశప్పకు నెట్టింట్లో అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులు కూడా కాశప్ప చేసిన పనికి అభినందనలు తెలిపారు.

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..