చెత్త డిబేట్లకు , తిట్లకు , తెలివితక్కువ వాదనలకు , కుల, రాజకీయ చర్చలకు మన టివి ఛానల్స్ టాప్ అని మనం అనుకుంటాం.. ఇంత సబ్ స్టాండర్డ్ టివి డిబేట్లు ఇక ఎక్కడా ఉండవని భావిస్తాం.. కానీ అది తప్పు.. అంతర్జాతీయంగా కూడా పనికిమాలిన టివి డిబేట్లలో , కొట్టుకోవడాలు , తిట్టుకోవడం , తోసుకోవడం .. ఇలాంటివి జరుగుతుంటాయి..
రష్యా , ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు టివి డిబేట్లు జరుగుతున్నాయి. అలాంటి టివి డిబేట్ ఒకటి ఉక్రేనియన్ టివిలో జరుగుతుండగా , రష్యా అనుకూలుడైన ఒక రాజకీయనాయకుడిని , జర్నలిస్ట్ లైవ్ లోనే కొట్టేసాడు. దీంతో ఇద్దరూ కలియబడి , రక్తం వచ్చేట్టు కొట్టుకున్నారు.. సిగ్గులేని ఈ చర్య మొత్తం లైవ్ లోనే జనం చూసేసారు.. రష్యా , ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుందో లేదోగానీ , టివి డిబేట్ లో , లైవ్ లో జరిగిన ఈ కొట్లాట రోత పుట్టించింది…