అప్పుడు పైపు లాగా ఉండేదాన్ని..ఇప్పుడు పీపాలాగా అయ్యాను.

  0
  1410

  పెళ్ళిసందడి.. 1996లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన కుటుంబ, ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు. అశ్వనీ దత్, అల్లు అరవింద్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. అయితే ఇప్పుడు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో ఈ మూవీని మళ్ళీ రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా జరిపారు. ఈ వేడుకలో అప్పటి పెళ్ళిసందడి హీరోయిన్లు దీప్తి భట్నాగర్, రవళి కూడా పాల్గొన్నారు. అప్పట్లో తన అందచందాలతో కుర్రకారును హీటెక్కించిన రవళి, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. స్టేజీపైకెక్కి తానే రవళి అని చెప్పినా.. ఎవరూ గుర్తించలేనంతగా మారిపోయింది. దీంతో ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిథులంతా అవాక్కయ్యారు. ఏదేమైనా తాము అభిమానించే హీరోయిన్ ఇలా మారిపోవడంతో చాలామంది అభిమానులు షాకయ్యారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..