పుర్రెకో బుధ్ధి.. జిహ్వకో రుచి అంటారు.. మెక్సికోకు చెందిన మ్యూజిక్ స్టార్ డాన్సర్ విషయంలో ఇది అక్షరాలా నిజమేననిపిస్తుంది.
మెక్సికోలో డాన్సర్ కు మంచి రాపర్ గా పేరుంది. ఇప్పుడు అతను గుండు చేయించుకొని.. తలంతా బంగారు చైన్లు, వజ్రాలు, కెంపులు.. ఇలా అనేక రకాల జాతి రాళ్లతో తన తలను అలంకరించుకున్నాడు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఆపరేషన్ కూడా చేయించుకొని. ఈ బంగారు వజ్రాల గొలుసులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలదన్నట్టు పళ్లకు కూడా బంగారు తొడుగు చేయించుకున్నాడు.
బంగారమంటే తనకు ఎంతో ఇష్టమని.. అందుకే వెంట్రుకల బదులుగా.. బంగారు పెట్టుకొని, తానిలా తయారయ్యానని చెప్పాడు. నాలుకపై కూడా డైమండ్ తో కుట్టించుకున్నాడు.
ఇవీ చదవండి..