రకుల్ కీ విడాకుల గండం, పెళ్లికి ముందే భయం.

    0
    323

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది. హీరో కమ్ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

    అయితే.. దీనిపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. రకుల్ – జాకీ జాతకాల్ని పరిశీలించిన ఆయన.. వారిద్దరికీ పెళ్లయితే ఎడబాటు తప్పదని కుండబద్దలు కొట్టాడు.

    గతంలో నాగ చైతన్య, సమంత విషయంలో కూడా ఆయన ఇలాగే చెప్పాడు. ఆయన చెప్పిన మాటలే నిజం కావటంతో.. రకుల్ జాతకంపై ఆయన కామెంట్లు ఇప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

    జాకీ భగ్నానీది మకరరాశి అని.. ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్పారు వేణు స్వామి. రకుల్ ది మిథున రాశి అని.. ఆమె జాతకం ప్రకారం గురువు.. కేతువు కలిసి ఉండటంతో కుటుంబం సౌఖ్యం ఉండదన్న జోస్యాన్ని ఆయన వినిపిస్తున్నారు.

    వారి పెళ్లి.. ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి ఆగుతుందని.. ఒకవేళ పెళ్లి జరిగినా తర్వాత చాలా ఇబ్బందులు తప్పవన్నారు. పిల్లలు కలగకపోవటంతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్నారు.

    ఆమె ఒక కేసు విషయంలో జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఇలా రకుల్ వైవాహిక జీవితానికి సంబంధించి.. ఆమె భవిష్యత్ జీవితానికి సంబంధించి వేణు స్వామి చెప్పిన జోస్యం ఇప్పుడు మింగుడుపడనిదిగా మారింది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..