పెళ్లిసందD హీరోయిన్ మోజులో మెగా హీరో..

  0
  564

  తెలుగు సినీ ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు బ్రాండ్ హీరోయిన్లు వేరు. ఆయన పరిచయం చేసిన, ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు.. టాప్ ప్లేస్ కి వెళ్లారు. ఈ జనరేషన్లో ఆయన సినిమాలు తగ్గించాక రాఘవేంద్రరావు బ్రాండ్ తగ్గిపోయింది. తాజాగా ఆయన నటిస్తూ, దర్శకత్వ పర్యవేక్షన చేసిన సినిమా పెళ్లిసందD. ఈ సినిమాతో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అయ్యాడు. సినిమా నిరాశ పర్చడంతో రోషన్ కెరీర్ పై పలువురు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోషన్ హీరోగా నిలదొక్కుకోవాలంటే మరో సినిమా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. కాని పెళ్లిసందD సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల మాత్రం మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.

  ఇప్పటికే రవితేజ సినిమాలో శ్రీలీలకు అవకాశం దక్కింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమెకు మరో ఇద్దరు యంగ్ హీరోల నుండి కూడా ఆఫర్లు అందాయనే వార్తలు వస్తున్నాయి. మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీలకు మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ దక్కిందట. ఇటీవల ఒక మెగా హీరోకు జోడీగా ఈమె నటించే అవకాశం ను దక్కించుకుందని.. చర్చల దశలో ఉన్న ఆ మెగా మూవీ ని వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.

  ఆ సమయంలో శ్రీలీల నటించబోతున్న ఆమె మూవీ ఏంటీ.. ఏ మెగా హీరోతో నటించబోతుంది అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే శ్రీలీలకు మెగా ఆఫర్ వచ్చింది అనేది నిజమే అంటూ మీడియా వర్గాల వారు కూడా అంటున్నారు. ఇంతకీ శ్రీలీల మోజులో పడిన ఆ మెగా హీరో ఎవరో తేలాల్సి ఉంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..