రకుల్ ప్రేమలో పడింది.. త్వరలోనే పెళ్లి..

  0
  153

  బాలీవుడ్ బ్యూటీ ర‌కూల్ ప్రీత్ సింగ్ ఈరోజు త‌న జ‌న్మ‌దిన వేడుకుల‌ను జ‌రుపుకుంటోంది.ఈ సంద‌ర్భంగా త‌న జీవితానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ప్ర‌క‌టించింది. త‌నకు కాబోయే లైఫ్ పార్ట‌న‌ర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫోటో పెట్టింది. అత‌డు…జాకీ భ‌గ్నానీ అని పేర్కొంది. భ‌గ్నానీతో క‌లిసి దిగిన ఫోటోను ఫేర్ చేసింది. అత‌నితో రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ర‌కూల్ త‌న సోష‌ల్ మీడియాలో జాకీని ఉద్దేశించి… ‘థ్యాంక్‌ యు మై లవ్‌. ఈ సంవత్సరం నేను అందుకున్న అతిపెద్ద బహుమతి నువ్వే. నా జీవితంలో రంగులు నింపినందుకు, నన్ను నవ్విస్తున్నందుకు ధన్యవాదాలు’ అని పోస్ట్ పెట్టింది. దీనిపై జాకీ భగ్నానీ స్పందిస్తూ… ‘‘ నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.

  ఎంత రుచికరమైన భోజనం అయినా నువ్వు లేకుండా తింటే వ్యర్థమే . హ్యాపీ బర్త్ డే రకుల్ ప్రీత్ సింగ్ ’’ అంటూ పోస్ట్ చేశారు. రకూల్ ఇలా పోస్ట్ పెట్టిందో లేదో… ఫ్యాన్స్, సినీ ల‌వ‌ర్స్‌… అప్పుడే ఆరా తీయ‌డం మొద‌లెట్టారు. ఇంత‌కీ జాకీ భ‌గ్నానీ ఎవ‌రు ? అత‌ని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అని నెటిజ‌న్లు తెగ వెతికేస్తున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత వశు భగ్నానీ తనయుడే జాకీ భగ్నానీ. స్వస్థలం కోల్‌కతా. ఉన్నత విద్యని అభ్యసించిన ఆయన ‘లీ స్ట్రాస్‌బర్గ్‌ థియేటర్‌ అండ్‌ ది ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (న్యూయార్క్‌)లో యాక్టింగ్‌ కోర్సు పూర్తి చేశారు. ‘రెహ్నా హై తేరే దిల్‌ మే‌’ చిత్రంతో నటుడిగా మారారు.

  అతిథి పాత్రలో మెప్పించారు. ‘కల్‌ కిస్నే దేఖా’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.  ‘ఫాల్తు’, ‘అజబ్‌ గజబ్‌ లవ్‌’, ‘యంగిస్థాన్‌’, ‘వెల్‌కమ్‌ టు కరాచీ’ తదితర చిత్రాలతో అలరించారు. బెల్ బాటమ్, కూలీ నెం-1, జవానీ జానేమాన్  తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ర‌కూల్ ఈ విషయం చెప్పిన కొద్ది సేపటికే కాజల్ అగర్వాల్, రాశీఖన్నా, ఆయుష్మాన్ ఖురానా తదితరులందరూ లవ్ సింబల్స్‌తో అభినందనలు తెలిపారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..