జయలలిత ఆశయం కోసం మళ్ళీ వస్తున్నా..

  0
  136

  తమిళనాడు అన్నాడీఎంకే రాజకీయాల్లో మళ్ళీ కలకలం.. ఆ పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళ మళ్ళీ పావులు కదుపుతొంది . తాజాగా తాను మళ్ళీ అన్నాడీఎంకే రాజకీయాల్లో వేలుపెడతానని చెప్పింది. పార్టీ నాయకత్వం కోసం పళనిస్వామి , పన్నీర్ సెల్వం మధ్య పోరు తీవ్రస్థాయికి చేరడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. వీరిద్దరి పోరు మధ్య పార్టీ మనుగడే కష్టం అయ్యే పరిస్థితుల్లో తాను , మౌనంగా చూస్తూ ఉండలేనని ఆమె తన మద్దతుదారులతో చెబుతున్నారు. త్వరలోనే పార్టీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. పార్టీ నిర్మాణానికి తానెంతో కష్టపడ్డానని , జయలలితకు అండగా నిలబడి , పార్టీ అభివృద్ధిలో పాలుపంచుకున్నానని తెలిపారు. అందువల్ల తన కళ్ళముందే పార్టీ నాశనం అయిపోతుంటే చూస్తూ ఉంటే , నాయకురాలు జయలలిత ఆత్మ క్షోభిస్తోందని అన్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..