కూతురు అల్లుడిని కలపాలని చూస్తున్న రజినీ..

  0
  78

  రజినీకాంత్ కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. సినిమాల్లో కూడా ఆయన కుటుంబ విలవల ఔన్నత్యాన్ని పెంచే పాత్రలెన్నో చేశారు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆయనకు ఆ బంధాలు, బంధుత్వాలు కలసిరాలేదనే చెప్పాలి. ఇద్దరు కూతుళ్లు కూడా విడాకులు తీసుకున్నారు. చిన్న కుమార్తె తిరిగి రెండో వివాహం చేసుకుని సంతోషంగా ఉంది. పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇటీవలే భర్త ధనుష్ తో వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకుంది. అయితే పెద్ద కుమార్తె విషయంలో రజినీకాంత్ ఆమెను ఒప్పించి మళ్లీ ధనుష్ కి దగ్గర చేయాలని చూస్తున్నారట. వారిద్దరూ విడిపోవ‌డాన్ని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ జీర్ణించుకోలేక‌పోతున్నారని సమాచారం. అల్లుడుని, కూతురిని కలిపేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కూతురికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తున్నారట.

   

  కూతురు, అల్లుడు విడిపోదామ‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టి నుంచి ర‌జ‌నీకాంత్‌ తీవ్ర మ‌నోవేద‌న‌కు లోన‌వుతున్న‌ట్లు కొన్ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. కూతురి జీవితాన్ని చ‌క్క‌దిద్దాల‌ని ఆయ‌న ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. వారి మ‌ధ్య క‌లిగిన ఎడ‌బాటు తాత్కాలిక‌మేన‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య మ‌ధ్య తీవ్ర విబేధాలు వ‌చ్చిన ప్ర‌తిసారి ర‌జ‌నీకాంత్ వాటిని ప‌రిష్క‌రించి ఇద్ద‌రినీ క‌లిపేవాడ‌ట‌. అయితే ఈసారి తీవ్ర‌స్థాయిలో గొడ‌వ‌లు రావ‌డంతో వారిద్ద‌రూ వాటిని ప‌రిష్క‌రించుకోవడానికి బ‌దులుగా విడిపోవ‌డానికే నిశ్చ‌యించుకోవ‌డంతో ర‌జ‌నీ లోలోనే కుమిలిపోతున్న‌ట్లు స‌మాచారం.

   

  రజినీకాంత్ తన కుమార్తెను బుజ్జగించాలని చూసినా కూడా కుమార్తె ఐశ్వర్య ఈసారి అస్సలు తండ్రి మాట వినడంలేదని తెలుస్తోంది. ధనుష్ ప్రవర్తనను ఆమె అస్సలు సహించడంలేదట. ఇతర అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకునే వారంటే తనకు అస్సలు పడదని తెగేసి చెబుతున్నారట. ధనుష్ ని భరించడం ఇక తన వల్ల కాదని చెబుతున్నారట ఐశ్వర్య. విడాకుల విషయంలో ఇక తన మనసు మార్చే ప్రయత్నం చేయొద్దని తండ్రికి స్పష్టం చేశారట ఐశ్వర్య. దీంతో రజినీకాంత్ తీవ్రంగా కుమిలిపోతున్నారు. మరోవైపు ధనుష్ తండ్రి కూడా కొడుకు, కోడలిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..