యడ్యూరప్ప మనవరాలి ఆత్మహత్య వెనుక.. ?

  0
  111

  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య సంచలనంగా మారింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన యడ్యూరప్ప మనవరాలు సౌందర్యకు 30 ఏళ్లు. భర్త నీరజ్ కూడా డాక్టర్ గానే పనిచేస్తున్నాడు. భార్యా భర్తలిద్దరూ డాక్టర్లు కావడం విశేషం అయితే ప్రస్తుతం 9 నెలల బిడ్డ కూడా ఉంది. ఈరోజు ఉదయం భర్త నీరజ్ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత సౌందర్య ఒక్కతే ఇంట్లో ఉంది.

  10 గంటల సమయంలో బంధువులు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆ తర్వాత భర్తను అడిగితే అతను పలుమార్లు ఫోన్ చేసి భార్య ఫోన్ తీయకపోవడంతో పక్కింటివాళ్లను విచారించారు. తలుపులు వేసి ఉన్నాయని చెప్పడంతో వెంటనే ఇంటికి వచ్చి పోలీసుల సాయంతో తలుపులు పగలగొట్టి చూస్తే ఆమె శవం ఫ్యాన్ కి వేలాడుతోంది. ఆస్పత్రికి తరలించేటప్పటికి ఆమె చనిపోయిందని చెప్పారు.

  యడ్యూరప్ప కూతురు పద్మావతి ఆమె తల్లి. మనవరాల మరణ వార్త వినడంతోనే యడ్యూరప్ప శోక సముద్రంలో మునిగిపోయారు. హడావిడిగా ఆస్పత్రికి వచ్చాడు. పెళ్లై రెండేళ్లు కూడా కాలేదు, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. సౌందర్య భర్తతో కలసి బెంగళూరు వసంత నగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉండేది. వ్యక్తిగత, కుటంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణం అని చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్ట్ మార్టమ్ కి పంపారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..