పునీత్ మృతి హీరోలను కన్నీరు పెట్టించింది..

  0
  2887

  కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో , తెలుగు చిత్రసీమ చిగురుటాకులా వణికిపోయింది.. టాప్ హీరోలు , క్యారెక్టర్ యాక్టర్లు అందరూ చలించిపోయారు. మెగాస్టార్ చిరు, బాలక్రిష్ణ , వెంకటేష్ , జూనియర్ ఎన్టీఆర్ , శ్రీకాంత్ ,ఆలీ ..ఇలా ఎందరో ప్రముఖులు , ఉరుకులు పరుగులమీద బెంగుళూరుకు చేరుకున్నారు. కన్నీటితో నివాళులు అర్పించారు..

  ఇటీవలకాలంలో అక్కినేని లాంటి మహానటులకు తప్ప , ఇంతపెద్ద సంఖ్యలో తెలుగు సినీ ప్రముఖులు ,అదికూడా పొరుగు బాషానటుడు మృతిపై ఇంతగా స్పందించిన సందర్భంలేదు.. ఏమిటి పునీత్ రాజ్ కుమార్ ప్రత్యేకత.. ? తెలుగు చిత్రసీమ , తెలుగు ప్రేక్షకులతో ఆయనకు అంతగా సంబంధం లేకపోయినా , మన హీరోలు , చిత్ర ప్రముఖులు ఇంతగా ఎందుకు తల్లడిల్లిపోయారు.. ఏనాటిదీ సంబంధం.. ఆయన మహానటుడు , కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కొడుకుగా , వీళ్ల్లంతా అక్కడకు పోలేదు.. మరి పునీత్ రాజ్ కుమార్ లో ప్రత్యేకత ఏమిటి..?? ఈ సమస్యకు సమాధానం ఒక్కటే.. ఆయన స్నేహం..

  తెలుగు సినీ రంగంలో తనకంటే పెద్దవారిపట్ల ఆయనకున్న గౌరవభావం.. అభిమానం.. ఆయన వారితో సంబంధాలను ప్రేమపూర్వకంగా మార్చుకున్నాడు. ఎవరు బెంగుళూరుకు పోయినా ఆయన ఆతిథ్యంలో ఉండాల్సిందే.. ఆయన ప్రేమలో తడిసి ముద్దకావలసిందే.. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు , వీలుచూసుకొని , వాళ్ళ ఇళ్లకుపోయి అందరినీ పలకరించి వస్తాడట.. నందమూరి కుటుంబంతో ఎంతబాగుంటాడో , చిరంజీవి కుటుంబంతోనూ అలాగే ఉంటాడు.. అదే ఆయన ప్రత్యేకత.,. ఆయన చూపే మధురమైన ప్రేమకు , స్నేహానికి మన హీరోలు కంటతడిపెట్టారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..