భార్యకు, ప్రియుడితో పెళ్లి జరిపించి..

  0
  2519

  పెళ్ళైన తరువాత భార్య ప్రేమ వ్యవహారం తెలిసి , ప్రియుడికే భార్యను కట్టబెట్టే కధలు సినిమాలుగా వచ్చాయి.. పెళ్ళైన తరువాత భార్య ప్రేమ వ్యవహారం తెలిసి భార్యనో , ఆ ప్రియుడినో చంపేసే సంఘటనలు కోకొల్లలు.. భర్తనే ప్రియుడి సాయంతో చంపేసే భార్యలు కూడా ఎంతోమంది.. అయితే ఈ స్టోరీలో ట్విస్ట్ డిఫరెంట్.. కాన్పూర్ కి చెందిన ఓ యువకుడికి కోమల్ అనే యువతితో పెళ్లయింది. ఆరు నెలలుగా భార్య దిగులుతోనే ఉంది.. భర్త పంకజ్ శర్మ కారణం చెప్పమన్నాడు.. ఎంతో కష్టం మీద భర్త బ్రతిమాలగా చివరకు , తాను చిన్ననాటినుంచి పింటూ అనే వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. పెద్దలకు తెలిసినా బలవంతంగా పెళ్లిచేశారని చెప్పింది. మనసు చంపుకొని , కాపురం చేయలేకున్నానని తెలిపింది. చివరకు భర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా తన తల్లి తండ్రులతో మాట్లాడాడు. తరువాత కోమల్ తల్లి తండ్రులతో సంప్రదించి , వారిని ఒప్పించాడు. కోమల్ ప్రియుడు పింటూ ని పిలిపించి మాట్లాడాడు. అంతా సవ్యంగా సర్దుబాటుచేసి కోమల్ కి సంప్రదాయబద్ధంగా విడాకులు ఇచ్చి , తానే కన్యాదాతగా , పింటూ కాళ్ళు కడిగి , కన్యాదానం చేశాడు. ఇలాంటి మంచిభర్తలు , త్యాగశీలురు , ఇలాంటి సంఘటనలు నిజజీవితంలో అరుదు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..