సిఐ కూడా ఓ బాటిల్ నొక్కేసి , జేబులో కుక్కేసి.

  0
  2912

  ఆ రాష్ట్రంలో మ‌ద్య నిషేధం ఉంది. మందు దొర‌క‌క మందు బాబులు అల్లాడిపోతున్నారు. పిడ‌చ క‌ట్టుకుపోయిన నాలుక‌పై కాస్త మందేసి సేద తీరుదామ‌ని అనుకున్నా… ఎక్క‌డా మ‌ద్యం చుక్క దొర‌క‌డం లేదు. అలాంటి ప‌రిస్థితుల్లో మ‌ద్యం వ్యాను క‌న‌బ‌డితే ఊరుకుంటారా ? చూస్తూ ఉండిపోతారా ? దోచేయ‌రూ..ఇక్క‌డ కూడా అంతే.. వ్యాన్ లో ఉన్న మ‌ద్యం మొత్తాన్ని దోచేశారంతే…

  బీహార్ రాష్ట్రంలో మ‌ద్య నిషేధం కొన‌సాగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో అప్పుడ‌ప్పుడు కొంత‌మంది మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా చేస్తున్నారు. అధికారులు కూడా స్ట్రిక్ట్ గానే ప‌ని చేస్తూ, దొరికిన మ‌ద్యం సీసాల‌ను సీజ్ చేస్తున్నారు. తాజాగా మ‌హాచాబ‌జార్ ఊరిలో ఓ వ్యాన్ లో పెద్ద‌మొత్తంలో అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా అవుతోంది. ఇది ఎవ‌రికీ తెలియ‌దు. పోలీసులకు గానీ, ఎక్సైజ్ సిబ్బందికి గానీ స‌మాచారం కూడా లేదు. అయితే వ్యాన్ న‌డుపుతున్న డ్రైవ‌ర్ కి కాస్త అల‌స‌ట వ‌చ్చిందో ఏమో… టీ తాగాల‌ని వ్యాన్ ని ఓ టీ షాపు ముందు ఆపాడు. కిందికి దిగి, టీ దుకాణానికి వెళ్ళాడు. ఉన్న‌ట్టుండి ఓ కుర్రాడు వ్యాన్ లో ఏముందో అని ప‌రిశీల‌న‌గా చూశాడు. అత‌నికి మ‌ద్యం సీసాల కేసులు కంట‌ప‌డ్డాయి. అంతే ప‌క్క‌నోళ్ళ‌కి చెప్పాడు.

  ఇంకేమంది అంద‌రూ ఆ వ్యాన్ లోకి చొర‌ప‌డ్డారు. పిల్లాడి నుంచి ముస‌లాడి వ‌ర‌కు దొరికిన మందు సీసాల‌ను దొరికిన‌ట్లు తీసుకుపోయారు. కొంత‌మంది కేసులు కేసులు ఎత్తుకెళ్ళారు. దీని గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు .. మందుబాబుల‌ను అక్క‌డి నుంచి వెళ్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. అప్ప‌టికే అంతా ఖాళీ అయింది. ఇందులో కొస‌మెరుపు ఏమిటంటే.. వ‌చ్చిన ఇన్స్‌పెక్ట‌ర్ కూడా ఓ మ‌ద్యం సీసాను త‌న జేబులో పెట్టుకున్నాడు. ఇదంతా కొంద‌రు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయింది.

   

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..