సినిమా తారల ప్రేమలు , పెళ్లిళ్లు , సహజీవనాలు , నీటి బుడగల్లానే ఉంటాయి. సినీ హీరోయిన్ , మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ , రోహ్మన్ షాల్ తో తన మూడేళ్ళ సహజీవనానికి గుడ్ బై చెప్పేసింది. ఇద్దరు బిడ్డలున్న సుస్మితాసేన్ కు ఇప్పుడు 46 ఏళ్ళు.. తనకంటే 15 ఏళ్ళ చిన్నవాడైన రోహ్మన్ షాల్ తో ఆమె సహజీవనం చేసింది.
ఆమె ఇద్దరు కూతుళ్లతోకూడా రోహ్మన్ షాల్ కలిసిపోయాడు. ఒకే కుటుంబంలా ఫొటోలకు ఫోజులిచ్చేవాళ్ళు . ఇద్దరు ఇక పెళ్లి చేసుకోబుతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో , రోహ్మన్ షాల్ తో తానూ విడిపోతున్నానని చెప్పింది. విడిపోయినా , తమ మధ్య స్నేహం , ప్రేమ అలాగే ఉంటాయని , సహజీవన బంధం మాత్రమే ముగిసిపోయిందని చెప్పింది..