టెన్షన్లో ప్రభాస్ ఫ్యాన్స్.. రాధేశ్యామ్ ఎప్పుడంటే?

  0
  830

  ప్రభాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ విడుదలపై అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈనెల 14న ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అయింది. అయితే ఒమిక్రాన్ ప్రభావంతో మరోసారి సినిమా వాయిదా పడే అవకాశముందనే ప్రచారం మొదలైంది. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

  అయితే ఈ వార్తలన్నీ కొట్టి పారేస్తూ ‘రాధేశ్యామ్’ జనవరి 14న కన్ఫర్మ్ చేశారు చిత్ర నిర్మాతలు. ప్రస్తుతం ఒమిక్రాన్ కారణంగా ఢిల్లీలో థియేటర్లు మూసివేశారు. ముఖ్యంగా ఢిల్లీలో, మహారాష్ట్రలోని ముంబై, కర్ణాటక, తమిళనాడులో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు కేవలం 50% ఆక్యుపెన్సీ ఉండడంతో ‘రాధేశ్యామ్’ వెనక్కి తగ్గుతుందని తాజాగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు ఉదయం నుంచి ‘హ్యాపీ న్యూఇయర్’ కంటే ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు పోస్ట్ పోన్ అంటూ ట్రెండ్ అవుతోంది. అయితే గాసిప్స్ అన్నింటికీ చెక్ పెట్టేశారు ‘రాధేశ్యామ్’ మేకర్స్. తాజాగా రిలీజ్ డేట్ తో కొత్త పోస్టర్ ను విడుదల చేసి సినిమా పోస్ట్ పోన్ అంటూ ప్రచారం చేస్తున్న అందరికీ సమాధానమిచ్చారు.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..