భావోద్వేగంతో సమంత సందేశం..

  0
  1420

  కొత్త ఏడాది సమంత తన భావోద్వేగాన్నంతా ఇన్ స్టా అకౌంట్ లో ఉంచుంది. 2022 కొత్త సంవత్సరంలో ఎలా ముందుకు సాగాలో చెబుతూ ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. తన పెంపుడు కుక్కలు బెడ్‌పై పడుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ తన జీవితాన్ని, అభిమానుల్ని ఉద్దేశిస్తూ ఈ సందేశాన్నుంచింది. ‘ఈ సంవత్సరం మీ అతిపెద్ద అచీవ్‌మెంట్ చాలా దూరం అయితే, ఆ రోజును మీరు ఫేస్‌ చేయలేకపోతే యధావిధిగా ఉదయం నిద్ర లేవండి. అలాగే సాధారణ జీవితాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అలవర్చుకోండి. అని పోస్టింగ్ పెట్టింది సమంత.

  మీకు నమ్మకం కలిగించే విషయాలను కనుగొనడం మొదలు పెట్టడండి. మీతో మీరు నిజాయితీగాండంది. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి చిన్న అడుగును కూడా ఎప్పటికి మీరు మర్చిపోవద్దు. ఇలాంటి విషయాల్లో మన అందరం కలిసి ఉన్నాము. ఈ 2022లో మరింత స్ట్రాంగ్‌గా, తెలివిగా, మరింత దయతో​ ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ సామ్‌ హ్యాపీ న్యూ ఇయర్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. సమంత పోస్ట్‌ ప్రతి ఒక్కరి హత్తుకుంటోంది. న్యూ ఇయర్‌ రోజున తన ఒంటరి జీవితాన్ని, ఒంటరి తనాన్ని ఇలా పంచుకుందంటూ ఆమె ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..