ఏపీలో భారీగా కరెంటు కోతలు.. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు..

  0
  101

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ వాసులకు సలహా ఇచ్చారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావొచ్చని, ఇప్పటినుంచే ప్రజలు సిద్ధంగా ఉండాలని, కరెంటు వాడకం తగ్గించుోకవాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 6నుంచి 10గంటల మధ్య కరెంటు వాడకం తగ్గించాలన్నారు. రెండు రోజుల క్రితం ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ కూడా విద్యుత్ ని ఎక్కువగా వాడొద్దని ప్రజలకు సలహా ఇచ్చారు. ఏసీ లాంటి పరికరాల వినియోగ గంటల్ని తగ్గించాలని చెప్పారు. సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య అధిక ధర వెచ్చించి కరెంటు కొనుగోలు చేస్తామని, ఆ సమయంలో కరెంటు వాడకం తగ్గించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకుంటున్న వేళ రాబోయే రోజుల్లో ఏపీకి కరెంటు కష్టాలు తప్పేలా లేవు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..