చివరి క్షణాల్లో వాటిని చూసుకుంటూ ప్రాణం వదిలి

  0
  234

  కుక్కలు… పిల్లులు… గుర్రాలు… మ‌నుషుల నేస్తాలు. వాటిని ఎంత ప్రేమిస్తే… అంత‌కుమించి ప్రేమిస్తాయి. త‌మ య‌జ‌మానుల కోసం కుక్క‌లు. పిల్ల‌లు ప్రాణాలు వ‌దిలిన సంఘ‌ట‌న‌లు చూశాం. ఇంట్లో కుటుంబ‌స‌భ్యుల్లాగా జంతువుల‌ను ప్రేమించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారిలో హాల్మెన్ కూడా ఒక‌రు. ఆమెకు 68 సంవ‌త్స‌రాలు. ఆమెకు గుర్రం, రెండు కుక్క‌లు, పిల్లులు ఉన్నాయి. వాటిని ఎంతో ప్రేమ‌గా పెంచుకునేది. సొంత బిడ్డ‌ల్లా చూసుకునేది. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా ఆమె గుర్రం స్వారీ చేసేది. అయితే ఆమె క్యాన్స‌ర్ బారిన ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది.

  ఆమెను ర‌క్షించేందుకు డాక్ట‌ర్లు విఫ‌ల‌య‌త్నం చేశారు. అయినా మృత్యువు ఆమెను కాటేసేందుకు సిద్ధమైపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో హాల్మెన్ త‌న చివ‌రి కోరిక తీర్చాల‌ని డాక్ట‌ర్ల‌ను కోరింది. త‌న గుర్రం, కుక్క‌లను చూడాల‌ని ఉందంటూ అర్ధించింది. డాక్ట‌ర్లు కూడా మ‌రో ఆలోచ‌న‌లేకుండా అందుకు స‌మ్మ‌తించారు. వాటిని ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు తీసుకొచ్చారు. హాల్మ‌న్ వాటిని ఎంతో ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకుని నిమిరింది. ఆప్యాయంగా పెంపుడు జంతువులను హ‌త్తుకుంది. ఆ త‌ర్వాత నిమిషాల వ్య‌వ‌ధిలోనే హాల్మ‌న్ క‌న్నుమూసింది. ఆమెకు పెంపుడు జంతువులంటే ఎంత ఇష్ట‌మో అర్ధ‌మై.. డాక్ట‌ర్లు, న‌ర్సుల క‌ళ్ళు కూడా చెమ‌రాయి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..