ఆ బాలుడు పోప్ టోపీపైనే చెయ్యివేశాడు..

  0
  79

  ప్రపంచ క్రైస్తవుల ఆరాధ్య దైవం వాటికన్ సిటీ అధినేత పోప్. పోప్ అంటే దైవదూత. అలాంటి దైవదూత దర్శనం దొరికితేనే మహాభాగ్యం అనుకుంటారు క్రైస్తవులు. అయితే పసిపిల్లలు, దైవ సమానులు, ఆ పసిపిల్లల్లో కొద్దిగా మతి స్థిమితం లేనివారు ఇంకా దేవుళ్లతో సమానం అనేది ఒక సూక్తి. ఈ వీడియోలో చూడండి. మతి స్థిమితంలేని ఓ బాలుడు, వాటికన్ లో పోప్ ఉన్న స్టేజ్ ఎక్కి, ఆయన తలమీద ఉన్న టోపీ తీసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఇలా ఎంత చేసినా పోప్ ఎంతో సహనంగా నవ్వుతూనే ఉన్నాడు.

  పోప్ చేతులు పట్టుకుని వాడు ఎగురుతున్నా, ఆయనేం పట్టించుకోలేదు. పోప్ పక్కనే కుర్చీలో కూర్చున్నా పట్టించుకోలేదు. ఆయన దైవ సందేశం ప్రతినిధి ద్వారా వినిపిస్తున్నప్పుడు అడ్డుకున్నా ఏమీ పట్టించుకోలేదు. బహుశా ప్రభువుకి ఉన్నంత సహనం పోప్ కి కూడా ఉంది. అందుకనే అంత అత్యున్నతమైన, పూజ్యనీయుడైన స్థానంలో ఉన్న పోప్, అల్లరి చేస్తున్న ఈ బాలుడ్ని ఎంతగానో భరించాడు. ఆనందించాడు కూడా. ఆ బాలుడిని కిందకు తీసుకెళ్లిన తర్వాతే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..