ఐ ఫోన్ -13 ప్రో.. హ్యాకయింది..కంపెనీ షాక్ .

  0
  637

  ఆపిల్ ఫోన్ అంటే అందరికీ ఎంతో క్రేజ్.. ప్రతీ కొత్త మోడల్ కు ఆపిల్ కొత్త హంగులు అద్దుతూ ఉంటుంది. తమ బ్రాండ్ వేల్యూ కాపాడుకుంటూ మెరుగులు దిద్దుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఫీచర్లను జోడిస్తూ ఉంటుంది. అందుకే ఆపిల్ ఫోన్ వాడేవారు.. వేరే ఫోన్లను వాడరు. ఎంత ఖర్చయినా పెట్టి..ఆపిల్ ఫోన్ ను సొంతం చేసుకుంటారు.అయితే ఆపిల్ ఫోన్లో వుండే ఫీచర్లు కూడా ఇతర ఫోన్లలో కనిపించవు. ఆపిల్ కంపెనీ కంటూ కొన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. తాజాగా ఆపిల్ కంపెనీ 13 ప్రో మోడల్ ను రిలీజ్ చేసింది. దీనిని హ్యాకింగ్ కు వీలు కాని విధంగా తయారుచేశామని కూడా కంపెనీ సగర్వంగా ప్రకటించింది.

  అయితే ఆపిల్ కంపెనీ విడుదల చేసిన 13ప్రో మోడల్ ఫోన్ ను ఇటీవల చైనాలో హ్యాక్ చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే.. చైనాలోని చెంగ్ డూ అనే ప్రాంతంలో ప్రతీ ఏడాది క్రేజీ కాంపిటీషన్ పెడుతుంటారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎవరైతే త్వరగా హ్యాక్ చేస్తారో వారికి ప్రత్యేక బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలకు అన్ని కంపెనీల ప్రతినిధులు కూడా హాజరవుతుంటారు. తాజాగా జరిగిన ఈ పోటీల్లో కున్ లున్ ల్యాబ్ టీం కేవలం 15 సెకండ్లలోనే ఆపిల్ 13 ప్రో ఫోన్ ను హ్యాక్ చేసింది. దీంతో ఆపిల్ ప్రతినిధులు కూడా నోరెళ్లబెట్టారు. ఈ టీం గతంలోనూ ఆపిల్ ఫోన్లు హ్యాక్ చేసేవారు. ఆపిల్ 13 ప్రో హ్యాక్ చేయడంతో నిర్వాహకులు వీరికి మూడు లక్షల డాలర్లు బహుమతి కూడా అందజేశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..