మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా రసవత్తరంగా సాగాయి. నటీనటులు తమ ఓటును వినియోగించుకున్నారు. సినీనటి పూనమ్ కౌర్ కూడా మా ఎన్నికల్లో ఓటు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలోగానీ, తెలంగాణలోగానీ ఆర్టిస్టులను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని సంచలన కామెంట్ చేసింది. స్వలాభం కోసం ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.ఈ విషయంపై మా ఎన్నికల్లో గెలిచే ప్రకాష్‌రాజ్ అయినా, మంచు విష్ణు అయినా దృష్టి పెట్టాలని కోరింది. ఇదిలావుంటే, కొన్నిరోజుల ముందు ఆమె ప్రకాష్ రాజ్ కు మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే.
Actress @poonamkaurlal Cast her Vote in #MAAelection2021 #PrakashRaj #RamCharan, #Acharya #Chiranjeevi #PawanKalyan #MAAelection #MAAElections2021 #PoonamKaur pic.twitter.com/CypMvKpZEx
— NewsQube (@TheNewsQube) October 10, 2021