మొగుడి చేతిలో చావు దెబ్బలు.. ఆస్పత్రిలో పూనమ్

  0
  220

  పూనమ్ పాండే మొగుడు మరోసారి రెచ్చిపోయాడు. ఆమెను దారుణంగా కొట్టాడు. దీంతో ఆమె మరోసారి ఆస్పత్రిపాలైంది. హాట్ గర్ల్ పూనమ్ పాండే పెళ్లి తర్వాత అష్టకష్టాలు పడుతోంది. సామ్ బాంబే ను ఆమె వివాహం చేసుకున్న తర్వాత గృహ హింసకు గురవుతోంది. చాలా కాలంపాటు రిలేషన్లో ఉన్న ఈ జంట 2020 సెప్టెంబర్ 10న పెళ్లి చేసుకున్నారు.

  హనీమూన్ లోనే నరకం..
  పెళ్లి త‌ర్వాత ఈ జంట హ‌నీమూన్‌ కి గోవా వెళ్లారు. ఆ స‌మ‌యంలో తనను శారీరకంగా, లైంగికంగా వేధించాడంటూ సామ్ బాంబే పై ఆమె కేసు పెట్టారు పూన‌మ్ . దీంతో గోవా పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కాంప్రమైజ్ కావడంతో పాటు, కలిసి ఉంటున్నారు.

  తాజాగా మరోసారి దాడి..
  తాజాగా పూన‌మ్ ఫిర్యాదు మేర‌కు ముంబై పోలీసులు సామ్ బాంబేని అరెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతున్న క్ర‌మంలో పూన‌మ్ అతనితో గొడ‌వ‌ప‌డింద‌ట‌. దీంతో ఆయ‌న పూన‌మ్ జుట్టు ప‌ట్టుకొని త‌ల‌ను గోడ‌కేసి కొట్టాడ‌ట‌. దీంతో పూనమ్‌ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన పూనమ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండ‌గా, పూన‌మ్ ఫిర్యాదు మేరకు ఆమె భ‌ర్త‌ను బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..