ఈ బుడ్డోడి వీడియో ఇప్పుడు ఇండియాలో వైరల్..

  0
  101

  పాత వీడియోలే అయినా కొన్ని సార్లు కొత్తగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. అలాంటిదే ఈ బుడ్డోడి వీడియో కూడా. అయితే దీనికి ఇప్పుడు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ తోడు కావడంతో ఈ వీడియో బాగా పాపులర్ అవుతోంది. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా.. ప‌లు ఫ‌న్నీ వీడియోలు, సందేశాత్మ‌క వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ మోటివేష‌న‌ల్ వీడియోను ఆయన ట్వీట్ చేశారు.

  ప్లే ఏరియాలో ఉండే గోడను ఎక్కేందుకు ఓ చిన్నపిల్లవాడు ప్ర‌య‌త్నించే వీడియో అది. ఆ బుడ్డోడు ముందు కొంచెం పైకి ఎక్కాక‌.. ఇంకా పైకి ఎక్క‌లేక కిందికి దిగుతాడు. మ‌ళ్లీ ఏమైందో కానీ.. మ‌రోసారి ట్రై చేసి పూర్తిగా పైకి ఎక్కుతాడు. ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్.. చాలామంది ల‌క్ష్యాలు కూడా అసాధ్యం అన్న‌ట్టుగానే అనిపిస్తాయి. కానీ.. ఒక్క‌సారి నువ్వు నీ ల‌క్ష్యం కోసం అడుగు వేశాక నిన్ను ఎవ్వ‌రూ ఆప‌లేరు.. అంటూ క్యాప్ష‌న్ పెట్టారు. ఇప్పుడీ వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..