ఐఫోన్ కొంటే సరిపోదు..ఇదికూడా కొనాలి..

  0
  170

  ఫోనే కాదు.. ఫోన్ తుడిచే గుడ్డ కూడా కాస్ట్ లీయే..
  ఐఫోన్ కొత్త మోడల్ ధర లక్షల్లో ఉంటుంది. ఐఫోన్ కొంటే సరిపోదు.. దాని మెయింటెనెన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. అవును, ఐఫోన్ కొని సరిపెట్టుకుంటామంటే కుదరదు. దాని యాక్సెసరీస్ కూడా కాస్ట్ లీవే ఉంటాయి. దానికి వాడే ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ కూడా కాస్ట్ లీ. ఇక ఐ ఫోన్ ని దేంతో పడితే, దాంతో తుడుస్తామంటే కుదరదు. దానికో ప్రత్యేకమైన క్లాత్ ఉంది. పాలిషింగ్ క్లాత్.. అంటూ దాన్ని ఏకంగా 1900 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ గుడ్డతో తుడుస్తేనే ఐఫోన్ పై గీతలు పడవని, అందుకే దీన్నే వాడాలని ప్రిఫర్ చేస్తోంది కంపెనీ. ఇంకేముంది ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ చచ్చినట్టు ఆ గుడ్డను కూడా కొనాల్సిందే. ఐఫోన్ తోపాటు, ఐఫోన్ తో వచ్చే వాచ్, ఇతర పరికరాలను కూడా ఈ గుడ్డతో తుడుచుకోవచ్చని చెబుతోంది కంపెనీ. మరో విశేషం ఏంటంటే.. ఈ గుడ్డ కొనడానికి కంపెనీ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఐఫోనా మజాకా..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..