గ్రహశకలం భూమిని ఢీకొనడం.. అంతా ..తూ తూ అంట.

  0
  141

  అదిగో గ్రహ శకలం, ఇదిగో గ్రహశకలం… భూమిని ఢీకొంటోంది, అక్కడ పడిపోతోంది, ఇక్కడ పడిపోతోందంటూ సోషల్ మీడియాలోనూ, టీవీ ఛానెళ్లలోనూ ఒకటే రొద, రచ్చ. వాస్తవాలకంటే తప్పుడు ప్రచారాలు, సంచలనమైన కథనాలు, వీటితో ప్రజలను భయపెట్టడం ఎప్పటికప్పుడు జరుగుతోంది. అయితే ఇప్పుడు నాసా ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం విశ్వాంతరాళంలో ఉన్న గ్రహ శకలాలు ఏదీ కూడా రాబోయే 100 ఏళ్లలో భూమిని ఢీకొనే అవకాశమే లేదని స్పష్టం చేసింది. భూ వాతావరణంలోకి కూడా అవి రావని, భూమికి దాదాపు 7కోట్ల 40లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాయని స్పష్టం చేసింది.

  అయితే ప్రస్తుతానికి ఒక నెల రోజుల వ్యవధిలో 8 గ్రహశకలాలు భూమికి దగ్గరగా అంటే 50లక్షల కిలోమీటర్ల దూరానికి వస్తాయని వాటి వల్ల కూడా ఇబ్బంది లేదని అన్నారు. అక్టోబర్ 15, 20, 25.. నవంబర్ 2, 13, 20, 21, 29తేదీల్లో సగటున 45 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమికి దగ్గరగా గ్రహ శకలాలు వస్తాయని, వీటిలో ఏదీ కూడా భూమిని ఢీకొనే అవకాశమే లేదని స్పష్టం చేసింది. నాసా, స్పేస్ ఎక్స్ తో కలసి గ్రహ శకలాలను ఢీకొనే రాకెట్లను తయారు చేసే ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. భవిష్యత్ లో 100 ఏళ్ల తర్వాత అయినా గ్రహ శకలాలు భూమిని ఢీకొనే పరిస్థితుల్లో ఈ రాకెట్లను ప్రయోగించి వాటి గమనాన్ని మార్చవచ్చని నాసా స్పష్టం చేసింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..