విజయవాడలో రౌడీలకు జాబ్ మేళా .. భలే , భలే..

    0
    157

    పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్న పోలీసులు..

    ( గూండాలు, కేడీలు, రౌడీలకు..)

    ఎవరైనా నేరం చేస్తే లోపలేస్తారని తెలుసు.. మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తుంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని కూడా తెలుసు.. అయినా సరే.. అలాగే తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఏం చేయాలి..? అలాంటి వారిని ఇంకేం చేయగలం.. అని ఆలోచించారు బెజవాడ పోలీసులు.. అందుకే వినూత్నంగా అలోచించి వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిసైడ్ అయ్యారు. ఎవరైనా నేరాలు చేయడానికి కారణం డబ్బు.. ఆ డబ్బు సంపాదించే మార్గాలని చూపిస్తే.. ఇంకెప్పుడూ నేరాలు చేయరు కదా.. ఇదే బెజవాడ పోలీసులు కాన్సెప్ట్.. అందుకే ఈ ఆలోచనను వెంటనే అమలుచేశారు.

    విజయవాడలో రౌడీలకు, కేడీలకు పెట్టింది పేరు. నేరస్తులతో పాటుగా అసాంఘిక కార్యకలాపాలు, బ్లేడ్ బ్యాచ్ లకు చెందిన వారు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వారిలో మార్పు తీసుకురావాలని పోలీసులు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రౌడీలను, కేడీలను, చిన్నచిన్న నేరాలు చేసినవారందరికీ విజయవాడలోని షాదీ ఖానా పంక్షన్ హాలులో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఇప్ప్పటివరకూ చేసిన తప్పులను మన్నించి.. వారందరికీ ఉపాధి అవకాశాలను సాక్షాత్తూ పోలీసులే కల్పించారు.

    విజయవాడ సీపీ కాంతి రాణా టాటా ఈ జాబ్ మేళాను ప్రారంభించారు. విజయవాడ సిటీ పోలీస్ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేశారు. పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులను తీసుకొచ్చి.. నేరస్తులతో మాట్లాడించారు. 16 పెద్ద కంపెనీలను తీసుకొచ్చి.. మొత్తంగా 1288 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇంతటితో ఆగకుండా ఉద్యోగాలతో సరిపెట్టుకోలేని.. నేరస్థులకు వ్యాపారం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు విజయవాడ సీపీ కాంతి రాణా టాటా చెప్పారు. కొన్ని బ్యాంకులతో మాట్లాడి ప్రత్యేక రుణాలను కూడా అందిస్తామని తెలిపారు.

    మొత్తానికి బెజవాడ పోలీసులు చేసిన ఈ కార్యక్రమం ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ జాబ్ మేళా కనుక సత్ఫలితాలను ఇస్తే.. ముందు ముందు ప్రతీ జిల్లాలోనూ ఇలాంటి కార్యక్రమాలు పెడతారేమో చూడాలి.

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..