ఈమెపేరు సింధు కుమారి.. చూసేందుకు అమాయకంగా కనిపిస్తుందిగానీ , అవినీతిలో మహా ముదురు మహిళ .. ఈమె జైపూర్ డ్రగ్ ఇన్స్పెక్టర్.. ప్రతిరోజూ హ్యాండ్ బ్యాగ్ , లంచం డబ్బుతో నిండాల్సిందే.. ప్రతి మెడికల్ షాప్ దగ్గర , డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తూ వీరవిహారం చేస్తోంది. చివరకు ఎసిబికి చిక్కి ఇప్పుడు జైలు పాలయింది.
డ్రగ్ ఇన్స్పెక్టర్ సింధు కుమారి నెలవారీ వసూళ్లు 25 లక్షలకు మించిపోతాయి. ఎసిబికి చిక్కినప్పుడు ఆమె చెప్పింది ఒకే మాట.. ఈ డబ్బంతా , నాకొక్కదానికే కాదు.. పైదాకా పంచాలని చెప్పింది. ఎవరెవరికి అని లెక్కలడిగితే , పైదాకా అంటుందేతప్ప వివరాలు చెప్పడంలేదు.. చివరకు ఎసిబి అధికారులు , ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు..