అనర్హులకు కిసాన్ సమ్మాన్.. రూ.3వేల కోట్లు..

  0
  75

  ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3వేల కోట్ల రూపాయలు జనం సొమ్ము వృథా చేసింది కేంద్రం. 42లక్షలమందికి అనర్హులైన రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి జమ చేసింది. వీరంతా మామూలోళ్లు కాదు. ఇన్ కమ్ ట్యాక్స్ పే చేసే రిచ్ రైతులు. పేదలకోసం ప్రవేశ పెట్టిన ఈ పథకం ఇలా దుర్వినియోగం అయిందని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్ లో ఒప్పుకున్నారు. 42లక్షలమందికి అనర్హులైన రైతులకు, ఇన్ కమ్ ట్యాక్స్ పేయర్లకు, 3వేలకోట్ల రూపాయలు ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద వారి అకౌంట్లలో జమ చేశారు. ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో వారి అకౌంట్లలో జమ చేశారు. అయితే ఈ తప్పుని దిద్దుకునే పనిలో పడింది కేంద్రం. వారి వద్దనుంచి ఆ డబ్బు రికవరీ చేసే పనుల్లో ఉన్నారు అధికారులు. అనర్హులకు పీఎం కిసాన్ నిధులు జమ చేసిన రాష్ట్రాల్లో అసోం ది ఫస్ట్ ప్లేస్. ఆ తర్వాత తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. ఏపీ ఈ విషయంలో చాలా మేలు. ఆధార్ కార్డ్ లోని పేర్లలో వచ్చిన కన్ఫ్యూజన్ తో అనర్హులకు కూడా ఇలా సొమ్ములు జమ అయ్యాయి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?